ఇప్పటికే తెలంగాణలో వైఎస్ ఆర్ తెలంగాణ పేరుతో వైఎస్ షర్మిల పార్టీని స్థాపించారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆమె తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణలో ఆమె పోరాడుతున్నారు..తాజాగా పాదయాత్రని ప్రారంభించారు షర్మిల. ఇది ఇలా ఉండగా తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఈ పార్టీని స్థాపించబోయేది కేంద్ర మాజీ మంత్రి తనయుడు శివశంకర్ తనయుడు. ఆయనే డాక్టర్ పుంజాల వినయ్. మరి ఈయనకి వైఎస్ షర్మిల లాగే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం విశేషం.
హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్లో మద్దతుదారులతో వినయ్ భేటీ కూడా అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్‌తో కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వినయ్ ప్రకటించారు. డిసెంబర్లో కొత్త పార్టీ పేరును వినయ్‌కుమార్ ప్రకటించనున్నారు. తన స్నేహితుడు డాక్టర్ మిత్ర… ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయవేత్తలకు గుర్తు చూసి ఓటేసే వాళ్లు కావాలని చెప్పారు. ఓటింగ్‌లో గుర్తులను కూడా ఓటర్లు గుర్తుపట్టలేని స్థితికి ప్రజలను తీసుకొచ్చారన్నారు. చదువుకున్నప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థిని చూసి ప్రజలు ఓటేస్తారని, అందుకే ప్రభుత్వాలు విద్యకు ఖర్చుపెట్టడం లేదని, విద్యావ్యవస్థను నీరు గారుస్తున్నారని వినయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి వినయ్ కుమార్ ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.