Tuesday, November 26, 2024

Delhi | నేర విశ్లేష‌ణ మాడ్యూల్‌ అభివృద్దిలో తెలంగాణ ముద్ర‌

స‌మ‌న్వ‌య ప్లాట్‌ఫాంలో నేర విశ్లేష‌ణ మాడ్యూల్ అభివృద్దిలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ‌ చూపిన ప్ర‌తిభ‌కుగానూ కేంద్ర హోం శాఖ అవార్డును ప్ర‌దానం చేసింది. ఇండియ‌న్ సైబ‌ర్ క్రైమ్ కోఆర్డినేష‌న్ సెంట‌ర్ (I4C) మొద‌టి ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఢిల్లీ విజ్ఞాన్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు.

కార్య‌క్ర‌మంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాష్ట్ర సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్ట‌ర్ శిఖా గోయ‌ల్ అవార్డును స్వీక‌రించారు. నేర గ‌ణాంకాల విశ్లేష‌ణ‌, నేరాల మ‌ధ్య ఉన్న పోలిక‌ల ఆధారంగా వాటిని అనుసంధానించ‌డం, నేరగాళ్ల నెట్‌వ‌ర్క్‌ను గుర్తించ‌డం, దేశ‌వ్యాప్తంగా ఉన్న చ‌ట్ట సంబంధ విభాగాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలో తెలంగాణ పోలీసులు పోషిస్తున్న పాత్ర‌ను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement