Friday, November 22, 2024

పోటాపోటీగా తీన్మార్ మల్లన్న vs పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఆధిక్యంలో వాణీదేవి

తెలంగాణ, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. . కాగా వరంగల్ ,నల్గొండ,ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్ లో హోరా హోరీ పోరు నడిచింది. . టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి vs తీన్మార్ మల్లన్న మధ్య నువ్వా నేనా అన్నట్టు కౌంటింగ్ ఉత్కంఠ ను రేపుతోంది. తొలిరౌండ్‌ ఫలితాలను అధికారులు ప్రకటించారు.16,130 ఓట్లతో టీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొలిస్థానంలో ఉన్నారు. ఇక ఆయనకు గట్టి పోటీనిచ్చిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న12,046 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో కోదండరాం, నాలుగో స్థానంలో బీజేపీ, ఐదవ స్థానంలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. తుది ఫలితాలు ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఎమ్మెల్సీ స్థానం రెండో రౌండ్ ఫలితాలు ప్రకటించిన అధికారులు.. మొదటి రౌండ్ లో మొత్తం ఓట్లు…55991, చెల్లని ఓట్లు 3009, చెల్లుబాటు అయిన ఓట్లు 52982.

ఇక కొద్ది సేపటి క్రితం మొదలైన రెండో రౌండు ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వర్ రెడ్డి మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ రెండో రౌండ్ లో…TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి…3,787 ఓట్ల ఆధిక్యం ఉన్నారు. రెండు రౌండ్స్ లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా 7,871 ఓట్ల ఆధిక్యతతో దూసుకుపోతున్నాడు.

ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో నిలిచారు. ఆమెకు 17,439 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 16,385 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి 5,082 ఓట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement