తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పదవికి గండం వచ్చి పడింది. ‘50 ఎకరాల వెంచర్ వేస్తూ సర్పంచ్ ను కలిస్తే సరిపోతుందా ఎమ్మెల్యే, మంత్రి ఉండరా? మాకేం ఇవ్వరా’ అంటూ మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన ఆడియో క్లిప్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్లు సర్వత్రా వినపడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ విషయంపై నానా గగ్గోలు చేస్తున్నాయి. కాగా మంత్రి మల్లారెడ్డి ఆడియో క్లిప్ నేపథ్యంలో సీఎం కార్యాలయం వివరణ అడిగినట్లు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో మల్లారెడ్డి సీఎం కేసీఆర్ను ఎర్రవల్లి ఫాంహౌజ్లో కలిసినట్లు తెలుస్తోంది. తన ఆడియో సంభాషణపై వివరణ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో త్వరలో కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ ఉండబోతుందని, ఈ సందర్భంగా మల్లారెడ్డి మంత్రి పదవి హుష్ కాకి అవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
మల్లారెడ్డి మంత్రి పదవికి ‘ఆడియో’ క్లిప్ ఎసరు?
By ramesh nalam
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement