కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఈ మేరకు కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాల వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం రూ.2 లక్షలు పొందడానికి కరోనాతో మరణించిన అర్హత గల జర్నలిస్టుల కుటుంబాల వారు జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
కోవిడ్-19తో మరణించిన కుటుంబాలకు గతంలో మాదిరిగానే 5 ఏళ్లపాటు నెలకు రూ.3వేల పెన్షన్ లభిస్తుంది. అంతేగాక మరణించిన జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి ఒక రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం అందిస్తామని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే తండ్రి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం