షర్మిల కొత్త పార్టీపై తెలంగాణలో పెద్ద దుమారమే లేస్తుంది. రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు లేని షర్మిల ఇప్పుడు వచ్చి నేను తెలంగాణ కోడలిని అంటూ పార్టీని జనాల్లోకి తెసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పార్టీ లో భాగంగా జిల్లాల కార్యకర్తల తో మీటింగ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా షర్మిలపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ కామెంట్స్ వస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం మాట్లాడుతూ విశాఖ ఉక్కు కోసం చేస్తున్న నిరసనలకు మద్దతుగా విశాఖ వెళ్లి పోరాటం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణలో ఉన్న సమస్యలు వదిలేసి విశాఖ వెళ్లి ఏం చేస్తారో అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది తెలంగాణ కోడలు ఇక్కడకు రాగానే ఆంధ్రా అల్లుడు ఇప్పుడు నిద్ర లేచాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అటు షర్మిలను ఇటు కేటీఆర్‌ను ఏకిపారేస్తున్నారు.