హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక వేతనాలను ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటూ వస్తుందని చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లో సెర్ప్ ఉద్యోగుల సంఘం నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చి ప్రభుత్వం మీకు సహకరిస్తుందని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 3978 మంది ఎంప్లాయిస్ లబ్ది చేకూరనుంది. ఏప్రిల్ 1వ తేది నుండి కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.