24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ క్లబ్ (న్యూ కన్వెన్షన్ హాల్) లో జరిగిన తెలంగాణ స్టేట్ దాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నంబూరు మధుసుధన్ రావు, జనరల్ బాడీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఈ భాగంగా వారితో కలిసి పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్గా నంభూరు మధు, జనరల్ బాడీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ దాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు మెమంటో అందజేసి, శాలువాతో సన్మానం చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ దాల్ మిల్లర్స్ అసోసియేషన్-2022/2025 సంవత్సరానికి ఆఫీస్ బేరర్స్ అధ్యక్షులుగా నంబూరు మధుసూధన్ రావు, కార్యదర్శిగా బిక్కుమల్ల శ్రీధర్, కోశాధికారిగా సంజయ్ మిట్టల్, ఉపాధ్యక్షులుగా కోడుమూరి శ్రీనివాసరావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, గండూరి ప్రకాష్, సంజయ్ కెడియా, జాయింట్ సెక్రటరీలుగా అభిషేక్ అగర్వాల్ తేరాల ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా తేరాల భాస్కర్, పుల్లకొండం సురేష్, పి.శరత్, కటకం వీరేందర్, దారా శ్రీనివాసరావు, నీల శ్రవణ్ కుమార్, రంగా హనుమంత రావు, పవన్ దారక్, అర్జున్ కెడియా, దొంతుల చంద్రశేఖర్, రాధేశ్యామ్, గంగాధర్, గ్రంది రమేష్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని, టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులకు రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు భీమా వంటి రైతు సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. గతంలో పవర్ హాలిడేస్, కరెంట్ కోతలు ఉండేవన్నారు. గతంలో రైస్ మిల్స్, దాల్ మిల్స్ వ్యాపారులు జనరేటర్స్ పెట్టుకొని నష్టపోయేవారు.. ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, తదితర ప్రాజెక్ట్ ల ద్వారా సాగునీరు అందిస్తున్నారన్నారు. రైతులు మంచిగా పంటలు పండిస్తున్నారన్నారు. వరిలో పంజాబ్ రాష్ట్రాని కంటే ఎక్కువగా ప్యాడి పండించామన్నారు. నాణ్యమైన కరెంట్ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల వ్యాపారులందరూ ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం తాను కూడా ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి తన వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో.. అమరవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్, ఆఫీస్ బేరర్స్ అధ్యక్షులు నంబూరు మధుసూధన్ రావు, కార్యదర్శి బిక్కుమల్ల శ్రీధర్, కోశాధికారి సంజయ్ మిట్టల్, ఉపాధ్యక్షులు కోడుమూరి శ్రీనివాసరావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, గండూరి ప్రకాష్, సంజయ్ కెడియా, జాయింట్ సెక్రటరీలు అభిషేక్ అగర్వాల్ తేరాల ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తేరాల భాస్కర్, పుల్లకొండం సురేష్, పి.శరత్, కటకం వీరేందర్, దారా శ్రీనివాసరావు, నీల శ్రవణ్ కుమార్, రంగా హనుమంత రావు, పవన్ దారక్, అర్జున్ కెడియా, దొంతుల చంద్రశేఖర్, రాధేశ్యామ్, గంగాధర్, గ్రంది రమేష్, పుర ప్రముఖులు, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.