జనగామ : ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. శనివారం కొడకండ్ల మండలం రామన్న గూడెం వద్ద ఉపాధి హామీ కూలీలతో మంత్రి ముచ్చటించారు. ఎండాకాలంలో ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. ఎండలు మండుతున్నందున ఉదయం, సాయంత్రం మాత్రమే పని చేయాలని కూలీలకు సూచించారు. నియోజకవర్గంలో కూలీలకు పనులు కల్పిస్తూ ఉపాధి అందేలాగా చూడటమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని వివరించారు. కూలీలకు అన్ని సదుపాయాలు సజావుగా అందించాలని మంత్రి సంబంధిత ఉద్యోగులను అదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement