Friday, November 22, 2024

తెలంగాణ దేశానికే ఆదర్శం..

ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. 96.74 శాతంతో దేశంలో తెలంగాణ నెం.1గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికలో వెల్లడయ్యిందని ఆయన తెలిపారు. తర్వాత స్థానాల్లో తమిళనాడు (35.39 శాతం), కేరళ (19.78శాం), ఉత్తరాఖండ్‌ (09.01శాతం), హర్యాణ (05.75 శాతం), కర్ణాటక (5.59 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (04.63 శాతం) రాష్ట్రాలు ఉన్నట్లు చెప్పారు. జమ్ము కాశ్మీర్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, నాగాలాండ్‌, మిజోరం, త్రిపుర, గోవా మొదలైన ఏడు రాష్ట్రాలు సున్న ప్రగతితో చివరి స్థానంలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్‌లో వారం రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం అభినందించిందన్నారు.

స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలన్నీ అగ్రగామిగా నిలుస్తూ మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి వంటి పథకాల వల్లనే మన పల్లెలు ఆదర్శంగా మారాయని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపడుతూనే నిరంతరం పారిశుధ్య పనులు చేయడం వల్లే ఇలాంటి ప్రశంసలు రాష్ట్రానికి దక్కుతున్నాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement