కులగణనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. బోయినపల్లిలోని ఐడియాలజీ సెంటర్లో మేధావులు, బీసీ సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో కుల వివక్ష ఉన్న మాట వాస్తవమేనన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారత్‌లో కుల వివక్ష ఎక్కువగా ఉందని అన్నారు.
దేశం ఆర్థికంగా బలంగా ఎదగాలంటే కుల వివక్ష ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు. జాతీయ స్థాయిలో కుల గణన చేపడతామని పార్లమెంట్ సాక్షిగా చెప్పిటన్టు గుర్తు చేశారు. వాస్తవాలు బయటకు రాకూడదనుకునే వారే కుల గణనను అడ్డుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.