Friday, November 22, 2024

Breaking: TS ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. రాష్ట్రంలో 9లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 67.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు.

ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని మూడు ప్రభుత్వ వెబ్‌సైట్లలో తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in,  results.cgg.gov.in,  examresults.ts.nic.inతోపాటు వీటిలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్‌ షీట్‌ను ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement