కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటలో లేని నేపథ్యంలో సూపర్ స్ప్రెడర్స్‌గా మారుతున్న వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ కూడా ప్రధానికి ఇదే విషయం చెప్పగా ఆయన కూడా అంగీకరించారు. దీంతో సూపర్ స్ప్రెడర్స్‌గా ఉన్న వారు ఎవరో గుర్తించాలని కేసీఆర్ మంత్రి హరీష్ రావు బృందానికి పని అప్పగించారు. తాజాగా సీఎస్, ఉన్నతాధికారులతో సమావేశం అయిన హరీష్ రావు సూపర్ స్ప్రెడర్స్ ఎవరో లెక్కలు తేల్చారు.
✤ ఎల్పీజీ గ్యాస్ డెలివరీ సిబ్బంది
✤ చౌకధరల షాపు డీలర్లు
✤ పెట్రోల్ పంప్ కార్మికులు
✤ ఆటో, క్యాబ్ డ్రైవర్లు
✤ రైతు బజార్లలో కూరగాయలు అమ్మే వారు
✤ పండ్లు, కూరగాయలు,పూల మార్కెట్లు
✤ కిరాణా షాపుల వర్తకులు
✤ మద్యం దుకాణాల వ్యాపారులు
✤ మాంసాహారం అమ్మేవారు
వీళ్లందంరికీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28 నుంచి ప్రాధాన్యత క్రమంలో వీరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. స్వయంగా వారి వద్దకే వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.