Tuesday, November 26, 2024

వాక్సినేషన్ డ్రైవ్ ను ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు: హైకోర్టు

ఇతర రాష్ట్రాల్లో  వ్యక్సినేషన్ డ్రైవ్ లాగ తెలంగాణలో ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వ్యాక్షినేషన్ ఇచ్చే విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందన్న పిటిషనర్లు తెలిపారు.  మొదటి దశలో ప్రైవేట్ హాస్పిటల్ చార్జీలపై ఫిర్యాదులకు ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంత ఇంటెన్సిటీ ఉన్నా ఆ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స లు సిటిస్కాన్ ఇతర టెస్టులకు ధరలు నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదని, కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ హాస్పిటల్లో అక్రమాలపై ముగ్గురు సభ్యుల కమిటీని నియమించాలని హైకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement