తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతరాష్ట్రాల జల వివాదంపై విచారించే అధికారం సుప్రీంకోర్టుకు గానీ, తమ పరిధిలో లేదని స్పష్టం చేసింది. కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సోమవారం ఈ పిటిషన్ విచారణ సంద్భంగా హైకోర్టులో.. ట్రైబ్యునల్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయి కదా అని పేర్కొంది. సెక్షన్ 11 అంతరాష్ట్రాల జల వివాదం ప్రకారం.. ఈ పిటిషన్ అర్హతపై పిటిషనర్‌లను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు 2008లో జల వివాదాలపై ఇచ్చిన తీర్పును చదువుకుని మంగళవారం రావాలని వారికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement