తెలంగాణలో ఈనెల 30న ప్రభుత్వం తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలతో పాటు మరికొన్ని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని ఖాళీలకు నిర్వహించే ఉపఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘమేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
By ramesh nalam
- Tags
- breaking news telugu
- high court
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- muncipal elections
- shabbir ali
- telangana
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu trending news
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement