Wednesday, December 4, 2024

TG | గోదావరి-కావేరీ జలాల్లో సగం వాటా ఇవ్వాలి…

గోదావరి-కావేరీ నదుల అనుసంధానం ద్వారా త‌ర‌లించే 148 టీఎంసీల నీటిలో సగం వాటా ఇవ్వాలని తెలంగాణ జాతీయ జలాభివృద్ధి సంస్థను మరోసారి కోరింది. మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ 74వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, హైదరాబాద్ ఇంజనీర్లు వర్చువల్ మోడ్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. తెలంగాణ నుంచి ఈ ప్రాజెక్టును చేపట్టడం వల్ల తాము అధిక భూభాగాన్ని కోల్పోతున్నామని, ఇందుకోసం తమకు ఎక్కువ వాటా ఇవ్వాలని జాతీయ జలసంఘం సంస్థను కోరారు.

అయితే మళ్లించే నీటిలో 42 టీఎంసీలకు మించి తెలంగాణనకు నీటిని ఇవ్వలేమని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరులో మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement