సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కర్ణాటకపై సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం)కు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ కేంద్ర జల సంఘానికి బుధవారం ఓ లేఖ రాశారు. తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలంటూ ఆ లేఖలో తెలంగాణ కోరింది. కృష్ణా నది నుంచి తుంగభద్రకు వరద నీరు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రాజెక్టుల కారణంగా దిగువ ప్రాంతమైన తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలిపింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని కూడా తెలంగాణ గుర్తు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..