Thursday, November 21, 2024

Telangana – రేవంత్ పాల‌న‌పై హ‌రీశ్ రావు గుస్సా

స‌మ‌స్య‌లున్నా ప్ర‌భుత్వం మొద్దు నిద్ర‌
పంచాయితీల‌లో నిధుల లేమి
మ్యాచింగ్ గ్రాంట్ లు ఇవ్వ‌క కేంద్ర నిధుల‌కు గ్ర‌హ‌ణం
రుణ‌మాఫీలో అవ‌క‌త‌వ‌క‌లు
క‌నీసం 30 శాతం మందికి కూడా రుణ‌మాఫీ కాలా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – సిద్దిపేట – రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే గానీ సర్కార్ లేవట్లేదని, పంచాయతీలో పారిశుధ్యం గురించి తాము లేవనెత్తాకే కార్మికులకు జీతాలందించారని విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ అన్ని పంచాయతీలకు నిధులు రాలేదని, కేసీఆర్ హాయంలో ప్రతి నెల పంచాయతీలకే రూ. 275 కోట్ల రూపాయలు టంచనుగా విడుదల చేసే వాళ్ళమని చెప్పారు.

- Advertisement -

సిద్దిపేట‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, మార్చి కన్నా ముందు కేంద్రం రూ. 500 కోట్లు పంచాయతీల కోసం విడుదల చేసిందన్నారు. వాటినీ కూడా రాష్ట్రం విడుదల చేయలేదని, ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరో రూ. 750 కోట్లు కేంద్రం విడుదల చేయలేదని చెప్పారు. రెండు నెలల ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు. మేము నిలదీశాకే ఒక నెలవి ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే కొంత చలనం వచ్చిందని మండిపడ్డారు.

రూ.2500 కోట్ల బిల్స్ పెండింగ్ లో..
ఈ మేరకు రూ.2500 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నయన్నారు. కేంద్రం నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం వల్ల అనేక పథకాలపై ప్రభావం పడిందని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 850 కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం రూ. 350 కోట్లు విడుదల చేయలేదు.. కేంద్రo మంజూరు చేసిన నిధులు 15 రోజుల్లో ఖర్చు చేయక పోతే వడ్డీ వసూలు చేస్తార‌న్నారు. బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌న్నారు.

విద్యుత్ శాఖలో తీవ్ర సంక్షోభం..
ఇక రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, కనీసo రోజూ వారీ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదన్నారు హ‌రీశ్ రావు. విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉందని, కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెబుతున్నారని మండిపడ్డారు. తొండలు, బల్లుల వల్లే కాదు హరీష్ రావు చెబితే కరెంటు తీసేస్తున్నారని అసంబద్ధ కారణాలు చెబుతున్నారు. రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ ఫార్మర్లు , స్తంభాలు కూడా ఇవ్వడం లేద‌న్నారు.

కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ లకు తులం బంగారం లేద‌ని అన్నారు.. కొత్తగా చెక్ లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. దాదాపు లక్ష చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి. సిద్దిపేటలోనే 3 వేలకు పైగా పెండింగ్ లో ఉన్నాయ‌న్నారు. రైతు బీమా చెక్కులు నెల రోజులు దాటినా రావడం లేద‌ని,. కేసీఆర్ హాయంలో వారం రోజుళ్లో ఐదు లక్షల బీమా చెక్ వచ్చేదీ. రైతు రుణ మాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం చెప్పినా అమలు కావడం లేద‌న్నారు.. త‌మ అధ్యయనం ప్రకారం లక్ష లోపు రుణ మాఫీకి అర్హులైన 30 నుంచీ 40 శాతం మందికి మాఫీ కాలేదంటూ మండిపడ్డారు. అమలు కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కూల్ ల కు ఫ్రీ కరెంటు జీవో..
ఇక స్కూల్ టాయిలెట్ల శుభ్రత సరిగా లేదని చెప్పారు. స్కూల్ ల కు ఫ్రీ కరెంటు జీవో ఇస్తామన్నప్పటికీ అది ఇవ్వలేదు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఫ్రీ కరెంటు బంద్ చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షం లో బీహార్ బ్యాచ్ అని మాట్లాడారు. ఆనాడు మాట్లాడింది ఏమిటీ ఇపుడు రేవంత్ చేస్తున్నదేమిటీ? అర్హత గల తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉంటే డీజీపీగా పంజాబ్ ఆయనను ఎందుకు నియమించావ్. నేను బీహార్ పంజాబ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వ్యతిరేకం కాదన్నారు. రేవంత్ అన్న మాటల్నే గుర్తు చేస్తున్నానని చెప్పారు. ఈ అధికారుల గురించి రేవంత్ అపుడేమి అన్నాడో అన్నిటిని బయటపెడుతాను. బిహారీ లంటే దోపిడీ దారులని అన్నాడు అన్నావ్. అప్పుడు వద్దు అన్న వారు ఇపుడు ఎలా నియమించారు. మేము ఆనాడు మహేందర్ రెడ్డిని డీజీపీగా నియమించాం. సర్వీసెస్ లో వికలాంగులు పనికి రారని స్మిత సబర్వాల్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించనంటూ హ‌రీశ్ తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement