మరిపెడ, ప్రభన్యూస్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన పర్వాతాధిరోహుడు భూక్య యశ్వంత్ నాయక్‌ను తెలంగాణ గవర్నర్ తమిళి సై తన కార్యలయంలో శనివారం శాలువాతో సత్కరించారు. అతి చిన్న వయస్సులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలు అధిరోహించి జాతీయ జండా ఎగురవేయటం గర్వంగా ఉందన్నారు. మారుమూల తండాలో జన్మించినా ధైర్యసాహసాలతో పర్వతాలు అధిరోహిస్తున్న యశ్వంత్ కీర్తి పతాకాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానన్నారని యశ్వంత్ తెలిపారు.
అత్యంత క్లిష్టమైన మంచు పర్వాతాలు అధిరోహించాలంటే శ్వాసపై సంపూర్ణ పట్టు- ఉండాలని, యముకలు కొరికే చలిలో ఎత్తైన పర్వతాలు అధిరోహిస్తున్న యశ్వంత్‌ను అభినందించారు. అనంతరం ఈ నెలలో ఆస్ట్రేలియాలోని పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్నానని యశ్వంత్ తెలుపగా తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని గవర్నర్ మాట ఇచ్చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎస్‌ఈ ఎలక్ట్రికల్ రాంజినాయక్ తదితరులున్నారు.