వికారాబాద్ : దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈరోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా నగదు పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 100 మందికి దళిత బంధు అందిస్తున్నామని, ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా పరిశీలన తదితర అంశాలన్నీ పూర్తయ్యాయన్నారు. మండల, జిల్లాస్థాయి అధికారులు నియోజకవర్గ స్థాయిలో దళిత బంధు పథకం పై అవగాహన సదస్సులు నిర్వహించి ఎలాంటి యూనిట్స్ నెలకొల్పాలనే అంశాల పై లబ్ధిదారులందరికి సూచనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో TSEWIDC చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..