Friday, November 22, 2024

25 రోజుల్లో 341 మంది మృతి: కరోనాపై ప్రభుత్వం నివేదిక!

తెలంగాణలో ఉన్న తాజా కరోనా పరిస్థితులపై  హైకోర్టుకు ప్ర‌భుత్వం నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామ‌ని, వాటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్‌, 19.16 లక్షల ర్యాపిడ్‌ పరీక్షలు ఉన్నాయని వివ‌రించింది. అదే స‌మ‌యంలో మొత్తం 341 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తెలంగాణ‌లో కరోనా పాజిటివ్‌ రేటు 3.5 శాతంగా ఉంద‌ని తెలిపింది. క‌రోనా నియంత్ర‌ణపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌ లైన్‌లో కొన‌సాగుతున్నాయ‌ని చెప్పింది. కరోనా కట్టడి కోసం మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపింది. మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారని వివ‌రించింది. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయించిందని, వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ చేరవేస్తున్నామని ప్రభుత్వం తెపింది. రెమిడివిసిర్ సరఫరా పర్యవేక్షణకు ప్రీతిమీనాను నోడల్ అధికారిగా నియమించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తన నివేదికలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement