Saturday, November 23, 2024

ఏపీ టీచర్లను రిలీవ్‌ చేసీన తెలంగాణ ప్రభుత్వం.. సీఎంకు ధన్యవాదాలు తెలిపిన పీఆర్టీయుటీఎస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగి తెలంగాణలో పనిచేస్తున్న 578 మంది ఆంధ్ర ఉపాధ్యాయుల(ఎన్‌ఎల్‌టీఏ)కు పంపించేందుకు ఎన్‌ఓసీ ఇస్తూ అక్కడి ప్రభుత్వానికి దస్త్రం పంపించినట్లు తెలిసింది.

తద్వారా పాఠశాల విద్యాశాఖలో మరో 578 ఖాళీలు ఏర్పడడంతో ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపట్ల పీఆర్టీయుటీఎస్‌ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌ హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement