హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ గురువారం నాడు ఈ నిధులను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లతో కలిపి మొత్తం రూ.2 వేల కోట్లు రిలీజ్ అయ్యాయి. మొత్తం రూ. 2 వేల కోట్లతో నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం ప్రకటించిన రూ. 2వేల కోట్ల నిధుల లక్ష్యం గురువారం విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సీఎం ఆదేశాలతో పూర్తి నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సీఎం ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.
ఈ వార్త కూడా చదవండి: మంత్రి మల్లారెడ్డిపై పీఎస్‌లో ఫిర్యాదు