తెలంగాణలో ముంపు ప్రాంతాల వరద బాధితులకు నష్టపరిహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.10వేలు ఇస్తామని గతంలో ప్రకటించగా, తాజాగా రూ.16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
అలాగే, మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, రూ.5 లక్షలు అందిస్తామని, ఎకరానికి రూ.10వేల నష్టపరిహారంతో పాటు తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయిన వారి కోసం పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.