తెలంగాణలో సంక్రాంతి సెలవులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా.. రెండు రోజుల ముందు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
దీంతో పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు, కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించారు. ఇక జనవరి 18న పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా… జనవరి 17న కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.