Saturday, November 23, 2024

కేసీఆర్… అవసరమా ఈ ఐప్యాడ్ లు

2021-22 సంవత్సరానికి గాను బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ విలువ రూ.2,30,825.96 కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు అని ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.పెట్టుబడి వ్యయం రూ. 29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 6,743.5 కోట్లుగా అంచనా వేశారు.కాగా మొత్తం బడ్జెట్ ముగిసిన తరువాత సభలో ఉన్నవారందరికి బడ్జెట్ కు సంబందించిన ప్రింటెడ్ కాపీలను ఇస్తారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ లకు తెలంగాణ ప్రభుత్వం ఐప్యాడ్ లను బహుమతిగా ఇచ్చింది.

బడ్జెట్ ప్రింటెడ్ కాపీలకు బదులుగా డిజిటల్ లో చూసుకునేందుకు ఈ ఐప్యాడ్ ను బహుకరించింది. కాగా దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొలువులు తీయటానికి నిధులు లేవు, నిరుద్యోగ భృతి ఇవ్వటానికి నిధులు లేవు…అని చెప్పే తెలంగాణ ప్రభుత్వం ఆడంబరాలకు పోయి వృధా ఖర్చులు మాత్రం చేస్తారు అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు. ప్రింటెడ్ కాపీలకు బదులుగా ఐప్యాడ్ లను ఇవ్వటం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement