తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం చట్టసవరణ చేయగా.. తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటైర్మెంట్ వయస్సు పెంపు ఇవాళ్టి (మార్చి 30) నుంచి అమలవుతుందని ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొంది. కాగా పదవీ విరమణ వయసు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement