గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ-ఫార్ములా రేసులో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణకు అనుమతించాలని ప్రభుత్వం జిష్ణుదేవ్ వర్మను అభ్యర్థించగా.. ఫార్ములా ఈ-రేస్‌పై విచారణకు తెలంగాణ గవర్నర్ నిన్న అనుమతిచ్చారు.
ఈ నేపథ్యంలో ఈ కేసుపై విచారణ జరపాలని రాష్ట్ర సీఎం శాంతి కుమారి తాజాగా ఏసీబీకి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీకి లేఖ రాసిన సీఎస్… ఆ లేఖలో గవర్నర్ ఆమోద లేఖను కూడా జత చేశారు.
- Advertisement -