Saturday, November 23, 2024

తెలంగాణలో 6 వేల మార్క్ దాటిన కరోనా

తెలంగాణలో కరనా కేసులు భారీగా పెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,206 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ​తో మరో 29 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 3,052 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,781 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 1,02,335 మందికి కరోనా పరీక్షలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వెయ్యికి చేరువలో కరోనా కేసులొచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 989 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్-421, రంగారెడ్డి-437, నిజామాబాద్‌-367, మహబూబ్‌నగర్-258 కొవిడ్ కేసుసు నమోదయ్యాయి.

మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 63 కంటెయిన్ మెంట్ జోన్లను ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చార్మినార్ పరిధిలో 12, సికింద్రాబాద్ పరిధిలో 11, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో పదేసి చొప్పున కంటెయిన్ మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఈ జోన్లలో 14 జోన్లలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఇవన్నీ కూకట్ పల్లి, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఒక ప్రాంతంలో ఐదుకు మించి కరోనా కేసులు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కట్టడి చర్యలు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారీ చేయించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement