హైదరాబాద్ – భారీ వర్షాలతో అతలాకుతలమైన ఖమ్మంను ఆదుకోవడానికి కాంగ్రెస్ కొండంత సాయం చేసింది. వరద బాధితుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల కోసం రెండు నెలల జీతాన్ని ఇవ్వాలని ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ రెండు నెలల జీతాన్ని సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలు కార్పోరేషన్ల చైర్మన్లు కూడా ఉన్నారు. వీరంతా తమ రెండు నెలల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారులు సైతం తమ రెండు నెలలు జీతం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు.
- Advertisement -
కాంగ్రెస్ నేతలంతా.. సీఎం రేవంత్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు