హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో రానున్న ఐదేళ్లలో క్యాన్సర్ కేసులు రెట్టింపు కానున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్ర క్యాన్సర్ భారం 12.5 శాతం పెరిగే అవకాశం ఉందని తేలింది. తెలంగాణ రాష్ట్ర క్యాన్సర్ ఫ్యాక్ట్ షీట్ ఆధారంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ విడుదల చేసిన రీసెర్చ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. మితిమీరిన పొగాకు వినియోగం కారణంగా 2025 నాటికి తెలంగాణలో కొత్త క్యాన్సర్ కేసులు ఏటా 53,565మేర పెరుగుతాయని రిపోర్టు హెచ్చరించింది. ప్రతి ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దూమపానం, గుట్కా, పొగాకు ఉత్పత్తుల నమలడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని ఆ నివేదిక సూచించింది. దూమ పాణం కారణంగా నోటి క్యాన్సర్ బారిన పడుతున్న యువత సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..