తెలంగాణ కేబినెట్ భేటీ ఆదివారం జరగనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం జరగనుంది. దళిత బంధు పథకం పై నే మొత్తం చర్చ జరగనుందని సమాచారం. దళిత భీమా, చేనేత బీమా పథకాల పై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కృష్ణా, గోదావరి బోర్డ్ ల పరిధి ఖరారు… అలాగే కరోనా వైరస్ వ్యాప్తి గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.