తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 30న రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో రైతు భరోసా, రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది.
అలాగే భూమిలేని పేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి అమలుచేస్తామన్ని రైతు భరోసా పథకంపై కూడా చర్చించనున్నారు.