జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. పొత్తు ధర్మాన్ని పవన్ విస్మరించారని ఈ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపామని బీజేపీ నేతలు గుర్తుచేశారు. అయితే ఎమ్మెల్సీ పోలింగ్ రోజే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంపై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.
పవన్ తెలంగాణ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని మండిపడ్డారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి.