Tuesday, November 26, 2024

తెలంగాణ అసెంబ్లీముట్టడి… AISF, కాంగ్రెస్ యూత్ నాయకులు అరెస్టు

అసెంబ్లీ ముట్టడికి పిలుపు AISF నాయకులు ప్రయత్నించారు. ఉస్మానియా యూనివర్శిటీకి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవటం పట్ల AISF అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే వీరిని గన్ పార్క్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వారిని అరెస్ట్ చేసి ఘోషామహల్ పీఎస్ కి తరలించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక రాష్ట్ర బ‌డ్జెట్‌లో నిరుద్యోగభృతికి నిధులు కేటాయించ‌కపోవడంపై నిర‌స‌న‌గా యూత్ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రాష్ట్ర అధ్య‌క్షుడు కె. శివ‌సేన రెడ్డి ఆధ్వ‌ర్యంలో అసెంబ్లీని ముట్ట‌డించారు. నిరుద్యోగ భృతిని వెంటనె విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే రాష్ట్రం నలుమూల నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న యూత్ సభ్యులు ఈ రోజు పకడ్బందీగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.

వందలాది మంది పోలీసులు, చెక్ పోస్టులను దాటుకుని మొదటగా రాష్ట్ర ఉపాద్యక్షురాలు ప్రవల్లిక సిద్దిపేట జిల్లా అద్యక్షురాలు ఆంక్ష రెడ్డి, వికారబాద్ అద్యక్షుడు సతిష్, బోనగిరి అద్యక్షుడు బఱ్ఱె నరేశ్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సుమారు వందమంది అసెంబ్లీ గేట్ 2వద్దకు చేరుకొని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అసెంబ్లీ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చెసారు. వారిని అరెస్టు చేసిన పొలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే అంతా సద్దుమణిగిందనుకన్న పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నాయకులు. మరికాసేపటికి మరో గుంపు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఊహించని పరిణామంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇక ఈ నెల 25 లోపు నిరుద్యోగ భృతి ప్రకటించకపోతే 26 న మరోసారి యువజన కాంగ్రెస్ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement