Tuesday, November 19, 2024

భారీ వర్షాల కారణంగా అసెంబ్లీ సమావేశాలు వాయిదా

తెలంగాణలో గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈరోజు సెలవు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేశారు. మూడు రోజుల పాటు సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు శాసనసభ, శాసనమండలి కార్యాలయాలు ప్రకటించాయి.

భారీ వర్షాలు, వరదల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని బులెటిన్‌లో అసెంబ్లీ కార్యాలయం సూచించింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు.. అనగా 28, 29, 30 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగవని వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభం అవుతాయి. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కూడా ఆయన అక్కడే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement