తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడింది. దళిత బంధుపై సుదీర్ఘ చర్చ అనంతరం శాసన సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దళిత బంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కూడా కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘మా’ పోరులో మరో ట్విస్ట్: ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ!