రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) పాలసీ సత్ఫలితాలనిస్తోంది. ఈ పాలసీలో భాగంగా ఓ వైపు రాష్ట్రంలో ఈవీల తయారీకి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాయితీలు ప్రకటించడంతో పాటు మరోవైపు విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఈ పాలసీతో రాష్ట్రంలో ఈవీల తయారీకి సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాటికి మెరుగైన మార్కెట్‌ను కల్పించడానికి ప్రభుత్వం రాచబాట వేసినట్లయింది.
దీంతో ఈవీల తయారీకి తెలంగాణ ఒక హబ్‌గా రూపొందుతోంది. ఇదిలాఉంటే పెద్ద కంపెనీలకు ధీటుగా స్టార్టప్‌లు కూడా ఈవీల తయారీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచస్థాయి ఇంక్యుబేటర్ అయిన టీ హబ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ గాయం మోటార్ వర్క్స్ (జీఎమ్‌డబ్ల్యూ)ఎలక్ట్రిక్ వాహనాల తయారీకిగాను ఇటీవల 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించిందని చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital