Saturday, November 23, 2024

Big story | హస్తినకు చేరిన తెలంగాణ, ఆంధ్ర జలవివాదాలు.. విజయం సాధించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : తెలంగాణ ఆంధ్ర మధ్యలో రగులుతున్న కృష్ణానది జలాల పంపిణీ వ్యవహారం ట్రిబ్యుల్‌ పరధిలోకి కేంద్ర క్యాబినెట్ చేర్చడాన్ని రాష్ట్ర నీటి పారుదల శాఖ స్వాగతిస్తూనే నీటి పంపకాల్లో 50 శాతం తగ్గకుండా తెలంగాణకు వాటా కావాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేసి తెలంగాణ నీటి వాటాలను నిర్ణయించాలని డిమాండ్‌ చేసూ ్తప్రధాని మోడీకి,కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగజేంద్ర సింగ్‌ షకావత్‌ కు సీఎం కేసీఆర్‌ లేఖలు రాశారు. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగా నీటి పారుదల శాఖ భావిస్తోంది.

అయితే ట్రిబ్యుల్‌ కాలాయాపన చేయకుండా నిర్ణీత గడువు విధించి నీటి పంపకాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని ఇరిగేషన్‌ శాఖడిమాండ్‌చేసింది. అలాగే పోతిరెడ్డిపాడు డిశ్చార్జి సామర్ధ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి 44వేలకు పెంచి నీటిని తోడటంతో శ్రీశైలం విద్యుత్‌ ప్రాజెక్టుకు, నాగార్జున సాగర్‌కు నీటి కొరత ఏర్పడుతోంది. అయితే 44వేల క్యూసెక్కులనుంచి ఏపీ ప్రభుత్వం 88 వేలక్యూసెక్కుల నీటిని డెడ్‌ స్టోరేజీ నుంచి తరలించేందుకు పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంచుతోందని ఇప్పటికే సీడబ్ల్యూసీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది.

పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యంపెంచడాన్ని ఆక్షేపిస్తూ కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఇప్పటికే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఏపీకి లేఖ రాసినా ఏపీ ప్రభుత్వం నిర్మాణ పనులు కొనసాగిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. ప్రధానంగా శ్రీశైలం నుంచి ఏపీ నీటిని అత్యధికంగా తోడటంతో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ పరిధిలోని తెలంగాణ వ్యసాయ క్షేత్రాలకు నీటి ఎద్దడి ఏర్పడుతోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మేరకు గోదావరి, కృష్ణా నది నిర్వహణ పర్యవేక్షించేందుకు , తెలంగాణ, ఏపీ మధ్య నది జలాల పంపిణీ పై వివాదాలను పరిశీలించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పడింది. ఈ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మించకూడదనే నిబంధనలను పొందుపర్చారు. అయితే నింధనలు పాటించకుండా ఏపీ ప్రాజెక్టులను నిర్మిస్తుందని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ఇటీవల కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం గతంలోని బచావత్‌ ట్రిబ్యునల్‌ ను పరిగణలోకి తీసుకోకుండా జరిగిన నీటి కేటాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు 811 టీఎం సీ నీటిని కేటాయించగా తెలంగాణకు ఇందులో కేవలం 299 టీఎంసీలు దక్కగా ఆంధ్రకు 512 టీఎంసీలు దక్కాయి.

- Advertisement -

అలాగే పోలవరం నుంచి పట్టిసీమ నీరు కృష్ణా పరివాహక ప్రాంతంలో కలుస్తోంది. ఈ నీటి నుంచి ఎగువనున్న తెలంగాణకు 45 టీఎంసీ నీటి వాటాకోసం తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. అలాగే నీటి వాటాలో జరిగిన అన్యాయాన్ని 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.అయితే కొత్తట్రిబ్యునల్‌ ఏర్పాటుచేస్తే సుప్రీంకోర్టులో వాజ్యాన్ని విరమించుకునేందుకు కేంద్రంతో జరిగిన ఒప్పందం మేరకు తెలంగాణ వాజ్యం విరమించుకున్నా కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాకపోవడంతో పాటుగా నిత్యం జలవివాదాలు ముదురుతున్నాయి.

299 టీఎంసీల్లో మిగిలినజలాలతో పాటుగా వరదల మయంలో నీటిని నిల్వచేసుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణాలకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణలో 90 కిలో మీటర్లు కృష్ణా ప్రవహిస్తున్నా, ఏపీ భూభాగానికంటే తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం అత్యధికంగా ఉన్నా ఇప్పటివరకు కేవలం 299 టీఎంసీల నీటి కేటాయింపును తెలంగాణ ఆక్షేపిస్తూ 50 శాతం నీటి కోసం ట్రిబ్యునల్‌ లో తెలంగాణ వాదించేందుకు సిిద్ధమైందని అధికారులు తెలిపారు. కేంద్ర క్యాబినెట్‌ వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌ కు బాధ్యతలు అప్పగించేందుకు తొమ్మిది సంవత్సరాలు పట్టింది.

తెలంగాణ ఆవిర్భవించిన నెలరోజులకే సీఎం కేసీఆర్‌ నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్‌ 3మేరకు కృష్ణా జలాల పంపిణీకోసం ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ట్రిబ్యునల్‌ లో కేవలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నీటి పంపకాలపైనే విచారణ జరగాలని అప్పట్లో సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేసారు. 2020లో జరిగిన అపెక్స్‌ కౌన్సి సమావేశంలో ను సీఎం కేసీఆర్‌ కృష్ణా నది జలాల్లో తెలంగాణకు జరిగినఅన్యాయాన్ని కేంద్రం దృష్టి తీసుకువచ్చారు. అయితే తొమ్మిదేళ్ల ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న కేంద్రం పరిష్కారానికి ఎంత సమయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement