Saturday, November 23, 2024

పానీపూరీవాలాతో తేజస్వి పెళ్లి.. ఐస్ క్రీమ్ పాప కోరిక!

టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అచ్చ తెలుగమ్మాయి తేజస్వీ. ఇండస్ట్రీలో ఎక్కువగా ఉత్తరాది అమ్మాయిలు హీరోయిన్లుగా కొనసాగుతున్నా.. తన అందంతో అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన తేజస్వీ.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘ఐస్‌క్రీమ్’ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందరికి షాక్ ఇచ్చింది. తర్వాత బిగ్‌బాస్ షో తర్వాత ఈ భామకి మంచి పాపులారిటీ పెరిగిపోయింది. సినిమాల సంగతి పక్కనబెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది ఈ బ్యూటీ. చిన్నతనంలో తను ఎలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అనుకుందో బయటపెట్టింది. తనకు పానీపూరీ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఆ పానీపూరీ చేసే వ్యక్తినే తాను పెళ్లి చేసుకోవాలని చిన్నతనంలో ఆశపడినట్లు పేర్కొంది. అయితే ఇప్పుడు తాను చిన్నపిల్ల కాదు కాబట్టి అసలు పెళ్లే వద్దు అని నిర్ణయం తీసుకున్నాను అని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement