ప్రముఖ జర్నలిస్ట్, Q న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను బ్లాక్ మెయిల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న మల్లన్న శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోలీసులు ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
కాగా శనివారం మల్లన్న బెయిల్ రిట్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మల్లన్న భార్య మత్తమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన 306, 511 సెక్షన్లు తొలగించాలని పిటిషనర్ కోరారు. కింది కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. ఇక ఈ కేసు సెప్టెంబర్ 14 కు వాయిదా పడింది.
ఈ వార్త కూడా చదవండి: కామారెడ్డిలో ఆర్మీ జవాన్ అదృశ్యం