Wednesday, November 20, 2024

Sunita Williams : రాకెట్‌లో సాంకేతికత లోపం.. సునీతా విలియమ్స్‌ రోదసి యాత్రకు బ్రేక్‌..!

కేప్‌ కెనావెరాల్‌ : భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి కారణమని నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ‌ ఉదయం 8.04 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ, చివర్లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారనేది మాత్రం వెల్లడించలేదు.

ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌లో ఉన్న కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి బోయింగ్‌కు చెందిన అట్లాస్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైంది. సరిగ్గా 90 నిమిషాల ముందు మిషన్‌ను ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. రాకెట్‌లోని ఆక్సిజన్‌ రిలీఫ్‌ వాల్వ్‌ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తాజా మిషన్‌లో భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారం పాటు బసచేయాలనేది ప్రణాళిక. స్టార్‌లైనర్‌ అభివఅద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్‌లైనర్‌ తొలి మానవరహిత యాత్ర ఐఎస్‌ఎస్‌ను చేరుకోలేకపోయింది. మరో యాత్రలో పారాచూట్‌ సమస్యలు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి.

తాజాగా విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. మిషన్‌ పైలట్‌గా వ్యవహరించాల్సిన సునీతకు ఇది మూడో అంతరిక్ష యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. మునుపటి యాత్రలో భగవద్గీతను తీసుకెళ్లిన ఆమె ఈసారి తన ఆరాధ్య దైవం గణపతి విగ్రహాన్ని వెంట పట్టుకెళ్లనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement