బోయింగ్ 737 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికి సాంకేతిక లోపాన్ని గుర్తించిన తర్వాత పైలట్‌ను విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించుకున్నాడని విస్తారా తెలిపింది. ‘కాక్‌పీట్‌లో కుడి వైపు నుంచి విజిల్ శబ్దం వినిపించడంతో ముంబైకి వెళ్తున్న విస్తారా యూకే-951 విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది’ అని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు తక్షణమే ప్రత్యామ్నాయ విమానం ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. విస్తారా ఎయిర్‌లైన్స్ టాటా కంపెనీ, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. అయితే… విమానాన్ని ప్రాథమికంగా పరిశీలించగా.. ఎలాంటి లోపం కనిపించలేదని.. ఘటనపై విచారణకు డీసీజీఏ ఆదేశించిందని ఆ అధికారి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement