న్యూఢిల్లి: ఢిల్లి నుంచి దుబాయ్ బయల్దేరిన స్సైస్ జెట్ ఎస్జీ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, పైలెట్ విమానాన్ని దారి మళ్లించి కరాచీలో ల్యాండ్ చేశారు. ప్రయాణీకులు అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. స్పైస్ జెట్ అధికార ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లి విమానాశ్రయంలో మంగళవారం దుబాయ్ బయల్దేరిన స్పైస్ జెట్ బి737 విమానం ఇండికేటర్ లైట్ సమస్య కారణంగా, కరాచీలో ల్యాండయింది.
విమానంలోని ప్రయాణీకులు అందరూ క్షేమంగా ఉన్నారు. అత్యవసరం ప్రకటించలేదని, సాధరణంగానే ల్యాండ్ చేయడం జరిగిందని ప్రకటించారు.ప్రయాణీకులను దుబాయ్ చేర్చడానికి కరాచీకి మరో విమానాన్ని పంపడం జరిగిందని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.