Tuesday, January 21, 2025

HYD | డ్రగ్స్ విక్రయిస్తున్న టెక్కీ అరెస్ట్ !

నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.21.06 లక్షలు 120 మి.గ్రాము ఎండీఎంఏ, కారును స్వాధీనం చేసుకున్నారు.

జమ్ముకశ్మీర్ కి చెందిన హర్జత్ సింగ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. డ్రగ్స్‌కు బానిసైన అతడు.. తన జీతం మొత్తం డ్రగ్స్ కొనడానికే వెచ్చిస్తున్నాడు. దీంతో డబ్బులు సరిపోక… కొనుగోలు చేసి డ్రగ్స్ ను ఎక్కువ ధరకు విక్రయించాలని పథకం వేశాడు.

తక్కువ ధరకు డ్రగ్స్‌ను మహారాష్ట్రలోని పూణేలో కొనుగోలు చేసి తనతో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement