టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా భాగస్వాములుగా మారాయి. 5జీ, ప్రైవేట్‌నెట్‌వర్క్‌లు, క్లౌడ్‌వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమయ్యే డిజిటల్ సొల్యూషన్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి, మార్కెటింగ్ చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌టెల్ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.
మరోవైపు టెక్ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లి కేషన్స్, ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. ఒప్పందం ప్రకారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో 5జీ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్ ను వృద్ధి చేసేందుకు ఇరుసంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..