Friday, October 18, 2024

Teaser – మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” టీజర్ అదుర్స్ – వీడియోతో

YouTube video

మెగాస్టార్ చిరంజీవి, యువ‌ దర్శకుడు వశిష్ఠ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం విశ్వంభ‌ర‌. ద‌స‌రా సంద‌ర్భంగా మూవీ టీజ‌ర్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా యూవీ క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థ‌ విడుద‌ల చేసింది.

సోషియో ఫాంటసీగా వ‌స్తున్న ఈ మూవీలో మ‌రోసారి చిరు త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేశారు. టీజ‌ర్‌లో గ్రాఫిక్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. మెగాస్టార్‌ మాస్‌ అవతార్‌, పవర్‌ఫుల్‌ డైలాగులు, గ్రాండ్‌ విజువల్స్‌తో ఈ టీజర్‌ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది.

ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బ‌డ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. అస్కార్ అవార్డు విజేత‌ ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement