Friday, November 22, 2024

ViratAnushka: విరాట్ కంట కన్నీరు… ఓదార్చిన అనుష్క‌

వరల్డ్ కప్ ఫైనల్స్‌ టీమిండియా ఓటమితో భారత క్రీడాకారులు తీవ్ర విచారంలో కూరుకుపోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర విచారంలో కూరుకుపోయిన విరాట్ కోహ్లీకి భార్య అనుష్క శర్మ అండగా నిలిచింది.

భర్తను కౌగిలించుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అనుష్కపై ప్రశంసలు కురుస్తున్నాయి. కష్టసమయంలో జీవిత భాగస్వామికి వెన్నంటి నిలుస్తోందంటూ జనాలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వారు ఆదర్శ దంపతులంటూ కితాబునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement