Friday, November 15, 2024

రైతు కంట కన్నీరు.. టమాటా కిలో 50 పైసలు.. రైతులు గ‌గ్గోలు..

దేశానికి అన్నంపెట్టే రైతుకు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఏదోర‌కంగా రైతులు న‌ష్ట‌పోతూనే ఉన్నారు. మంట మంచిగా పండిన బాదే.. పండ‌క‌పోయినా బాదే.. ఈసారి ట‌మాటా సాగులో భారీగా దిగుబ‌డి వ‌చ్చింది. దీంతో ట‌మాటా రేట్ భారీగా ప‌డిపోయింది. రూ.50 పైస‌లు కిలో ట‌మాటా!! ఇదెక్క‌డి న్యాయం అంటున్నారు రైతులు. ఈసారి ట‌మాటా సాగులో దిగుబ‌డి ఆశించిన మేర రావ‌డంతో మొద‌ట్లో రైతులు సంబుర‌ప‌డ్డారు. ఈ సంబురం ఎంతో సేపు లేదు. మార్కెట్ యార్డుకు తీసుకెళ్తే ట‌మాటా రూ.50 పైస‌లు అంటున్నారు. మేమే పండించిన పంట ఖ‌ర్చు కూడా ఇందులో వెళ్ల‌క‌పోగా.. అద‌నంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని రైతులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఆశించిన మేర పంట‌ప‌డితే ధ‌ర‌లు ఇలా ప‌డిపోయాయ‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. పంట న‌ష్ట‌పోయిన స‌మ‌యంలో రూ.50-100 వ‌ర‌కు ప‌లుకుతున్న ధ‌ర‌లు.. ఇప్పుడు రూ.50 పైస‌లు ప‌ల‌క‌డం ఏమిట‌ని రైతులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా ఐయితే వ్య‌వ‌సాయం చేసేదెలా అంటున్నారు. ఇదిలా ఉంటే… మార్కెట్లో 20 నుంచి 25 రూపాయలు.. కానీ కష్టించే రైతుకు మాత్రం లభించేది కిలోకి 50 పైసలు మాత్రమే. నిత్యం వంటగదిలో వాడే టమోటా ఒకప్పుడు వెలుగు వెలిగింది. ఇప్పుడు కూడా ధరలు తగ్గినా.. మరీ రైతుకు 50 పైసలు ఇచ్చేంత కాదు. టమోటా రైతులు మార్కెట్ కి కూడా తేవడానికి వీలులేనంతగా రేట్లు పడిపోయాయి. దీంతో టమోటా రైతులు లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లాలో టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి. జిల్లాలో పత్తికొండ ఆస్పరి, ఆలూరు మండలాల పరిధిలో టమోటా విస్తారంగా సాగు చేస్తారు. మదనపల్లి మార్కెట్ తర్వాత పత్తికొండ మార్కెట్లో టమోటా ఎక్కువగా అమ్మకాలు కొనసాగుతాయి. ప్రతిరోజు 20 లారీలకు పైగా టమోటా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. గత మూడు రోజుల క్రితం కిలో రూపాయి.. అర్థ రూపాయి కూడా పలకడం లేదు. ధర సంగతి తెలిసి కొంతమంది అక్కడే పారవోసి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ధరల స్త్రీకరణతో కొనుగోలు చేసి రైతులను ఆదుకొని తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement